మన్సూరాబాద్, జూలై 3: ఒక నోటును రెండు నోట్లుగా మారుస్తాను.. ఐదు వందల నోటు ఒకటి ఇస్తే.. రెండు నోట్లుగా మార్చి వెయ్యి రూపాయలు చేస్తానంటూ.. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ అమాయకులను మోసం చేస్తున్న ఐవరీ కోస్ట్ దేశానికి చెందిన నిందితుడిని ఎల్బీనగర్ ఎస్ఓటీ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. ఎల్బీనగర్లోని డీసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ బి. సాయిశ్రీ కేసు వివరాలను వెల్లడించారు.
డెమో ఇచ్చే సమయంలో మొదట రెండు రూ. 500 అసలు నోట్లను ఎవరికీ కనిపించకుండా మలిచి ఎడమ చేతిలో పెట్టుకుంటాడు. డెమోను తిలకించేందుకు వచ్చిన వ్యక్తి నుంచి రెండు రూ. 500 నోట్లను తీసుకుంటాడు. సదరు రెండు నోట్లను రెండు తెల్ల కాగితాల మధ్య పెట్టి అయోడిన్, ఇతర రసాయన పౌడర్లను రాసి ఒక ఎన్వలప్ కవర్లో పెడతాడు. కొంత సేపటి తర్వాత ఆ నోట్లను శుభ్రపరిచేందుకు ఒక కప్పు నీటిలో ముంచుతూ డెమోను తిలకించేందుకు వచ్చిన వ్యక్తి దృష్టి మళ్లిస్తాడు. ఎన్వలప్లో ఉన్న రెండు రూ. 500 నోట్లతో పాటు అప్పటికే తన ఎడమచేతిలో దాచిన మరో రెండు రూ. 500 నోట్లను కప్పులో వేసి కడిగినట్లు చేసి నాలుగు రూ. 500 నోట్లను బయటకు తీసి చూపుతాడు.