చంపాపేట, మార్చి 24: చంపాపేట డివిజన్ ఐఎస్ సదన్‌లో ఓ లాయర్ దారణహత్యకు (Murder) గురయ్యాడు. సోమవారం ఉదయం అంబేద్కర్‌వాడలో న్యాయవాది ఇజ్రాయెల్‌ను దస్తగిరి అనే వ్యక్తి కత్తితో పొడిచి చంపేశాడు. అడ్వకేట్ ఇజ్రాయెల్ ఇంట్లో ఓ మహిళ కిరాయికి ఉంటున్నది. ఆమెను దస్తగిరి అనే ప్రైవేటు ఎలక్ట్రీషియన్ గతకొంతకాలంగా వేధిస్తున్నాడు. ఈ విషయమై బాధితురాలి తరఫున ఇజ్రాయెల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అతనిపై కక్షపెంచుకున్న దస్తగిరి.. అడ్వకేట్‌పై దాడిచేసి హత్యచేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదుచేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు.