భూములు కోల్పోయే రైతులకు న్యాయం చేస్తాం : భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పులుసుబొంత ప్రాజెక్ట్ నిర్మాణానికి సంభందించి భూములు కోల్పోయే రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని భద్రాచలం సబ్ కలెక్టర్, పులుసుబొంత ప్రాజెక్ట్ అధికారి మృణాల్ శ్రేష్ఠ స్పష్టం చేశారు. గురువారం కరకగూడెం మండల పరిధిలోని..
కరకగూడెం, జూన్ 11 : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం పులుసుబొంత ప్రాజెక్ట్ నిర్మాణానికి సంభందించి భూములు కోల్పోయే రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని భద్రాచలం సబ్ కలెక్టర్, పులుసుబొంత ప్రాజెక్ట్ అధికారి మృణాల్ శ్రేష్ఠ స్పష్టం చేశారు. గురువారం కరకగూడెం మండల పరిధిలోని అనంతారం గ్రామం రైతు వేదిక భవనంలో కుడి, ఎడమ కాలువ నిర్మాణాల్లో 144.16 ఎకరాల భూమిని కోల్పోతున్న సమత్ మోతే రెవెన్యూ పరిధిలోని రైతులతో ఆయన ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి, వారి అభ్యంతరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాటాడుతూ.. భూములు కోల్పోయే ప్రతీ రైతుకు ప్రభుత్వం నుండి మెరుగైన పరిహారం అందిస్తామన్నారు. అనంతరం పలువురు రైతులు తమ అభ్యంతరాలను తెలిపారు. భూములు సర్వే చేసినప్పటికి ఇంతవరకు నోటీసులు రాలేదని సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన సర్వే పట్ల ఎటువంటి ఆందోళన అవసరం లేదని, ప్రభుత్వ నిబంధనల మేరకు భూములు కోల్పొయిన రైతులందరికీ పరిహారం అందించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసీల్దార్ వట్టం కాంతయ్య, ఇరిగేషన్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

