సామ్రాట్, డీమోన్ పవన్, లిఖిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సాV3’. కృష్ణమాయ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వి.విజయ నిర్మిస్తున్నారు. త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది. వినూత్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని, నేటి యువతరానికి బాగా కనెక్ట్ అవుతుందని దర్శకుడు తెలిపారు.
త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని నిర్మాత వి.విజయ తెలిపారు. ఈ సినిమాకు నిర్మాణ దశలోనే పాజిటివ్ వైబ్స్ ఉన్నాయని కథానాయిక లిఖిత చెప్పింది. ఈ చిత్రానికి సంగీతం : సాయికార్తీక్, ఆర్ట్, స్టోరీ, స్క్రీన్ప్లే, దర్శకత్వం: కృష్ణమాయ.