Woman Doctor | పురుష మృతదేహాల ప్రైవేట్ పార్ట్స్‌పై మహిళా డాక్టర్ జోక్స్.. విమర్శలు వెల్లువెత్తడంతో క్షమాపణ
Woman Doctor | ఓ కామెడీ షోలో ఒక మహిళా డాక్టర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైద్యవిద్యలో శిక్షణ కోసం ఉపయోగించే మృతదేహాలపై (కడావర్స్) ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో నెటిజన్లు, వైద్య వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. డాక్టర్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి.
Woman Doctor : ఓ కామెడీ షోలో ఒక మహిళా డాక్టర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. వైద్యవిద్యలో శిక్షణ కోసం ఉపయోగించే మృతదేహాలపై (కడావర్స్) ఆమె చేసిన అనుచిత వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దాంతో నెటిజన్లు, వైద్య వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. డాక్టర్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో చివరకు ఆమె బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది.
ముంబైలోని ప్రసిద్ధ కేఈఎం ఆసుపత్రి నుంచి ఎంబీబీఎస్ పూర్తి చేసిన డాక్టర్ సెజల్ పవార్.. ఇటీవల స్టాండప్ కమెడియన్ ప్రణీత్ మోర్ నిర్వహించిన షోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా కమెడియన్ అడిగిన ఓ ప్రశ్నకు ఆమె బదులిస్తూ.. అనాటమీ క్లాసుల్లో పురుషుల మృతదేహాలను చూసినప్పుడు తమ స్నేహితురాళ్లతో కలిసి వాటి ప్రైవేట్ పార్ట్స్ గురించి సరదాగా మాట్లాడుకునేవాళ్లమని, వాటి పరిమాణాలను పోల్చి చూసేవాళ్లమని నవ్వుతూ చెప్పారు.
ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో డాక్టర్ సెజల్పై విమర్శలు వెల్లువెత్తాయి. వైద్యం కోసం తమ శరీరాలను దానం చేసిన వారిపట్ల కనీస గౌరవం లేకుండా మాట్లాడటం వైద్య నైతికతకు విరుద్ధమని పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైద్య విద్యార్థులు మృతదేహాన్ని తాకే ముందు చేసే ‘కడావరిక్ ఓత్’ (శవపరీక్ష ప్రమాణం)ను ఆమె అవమానించారని మండిపడ్డారు. వివాదం ముదరడంతో డాక్టర్ సెజల్ పవార్ ఇన్స్టాగ్రామ్ ద్వారా క్షమాపణలు తెలిపారు.
‘ఆ షోలో నేను చాలా అమాయకంగా, ఆలోచించకుండా మాట్లాడాను. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి. నేను చేసిన తప్పుకు పూర్తి బాధ్యత వహిస్తున్నాను. భవిష్యత్తులో ఇలాంటి పొరపాటు పునరావృతం కాదు” అని ఆమె పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

