హెచ్ఎండీఏ పార్కుల్లో ల్యాండ్ స్కేపింగ్
శివారు ప్రాంతాల్లో ప్రణాళికగా పట్టణీకరణ జరిగేలా హెచ్ఎండీఏ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నది. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండీఏ మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. హైదరాబాద్ మహానగరం ఔటర్ రింగు రోడ్డు దాటి నలు దిక్కులా విస్తరిస్తోంది
- ఖాళీ స్థలాల్లో పచ్చదనం పెంపునకు చర్యలు
సిటీబ్యూరో, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): శివారు ప్రాంతాల్లో ప్రణాళికగా పట్టణీకరణ జరిగేలా హెచ్ఎండీఏ ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్తున్నది. ప్రస్తుత అవసరాలే కాకుండా భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని హెచ్ఎండీఏ మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది. హైదరాబాద్ మహానగరం ఔటర్ రింగు రోడ్డు దాటి నలు దిక్కులా విస్తరిస్తోంది. దానికనుగుణంగానే ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) చుట్టూ ఉన్న ప్రాంతాలను గ్రామ పంచాయతీలుగా వదిలేయకుండా ప్రణాళికాబద్ధమైన పట్టణీకరణ జరిగేలా మున్సిపాలిటీలను ఏర్పాటు చేసి జీహెచ్ఎంసీ తరహాలో ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తోంది.
తాజాగా హెచ్ఎండీఏ పరిధిలో పార్కులుగా గుర్తించిన స్థలాల్లో ల్యాండ్ స్కేపింగ్ చేసేందుకు చర్యలు చేపట్టారు. లేఅవుట్లలో భాగంగా పార్కులకు కేటాయించిన స్థలాలు కబ్జాకు గురి కాకుండా చూడటంతో పాటు వాటిని చుట్టు పక్కల వారికి ఉపయోగపడేలా అభివృద్ధి చేయనున్నారు. ఇందుకోసం ఇటీవల పనులు చేపట్టేందుకు టెండర్లను పిలిచారు. ఈ నెల 28లోగా టెండర్లు దాఖలు చేయాలని నోటిఫికేషన్ను జారీ చేసింది.అర్హత కలిగిన సంస్థలను ఎంపిక చేసి ప్రాధాన్యతా క్రమంలో పార్కుల్లో పచ్చదనం పెంపొందించడంతో పాటు మొక్కలను పెంపకాన్ని పెద్ద ఎత్తున చేపట్టనున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- hmda
- Hyderabad
- Land scaping
- layout
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

