కేంద్రం అరాచకాలకు కోర్టులు సమాధానం చెప్పాలి
ఢిల్లీలో జరుగుతు న్న కేంద్ర అరాచకాలపై సుప్రీంకోర్టు, హైకోర్టులు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ,ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్య త వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో లిబర్టీ చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
కవాడిగూడ, జూలై 23ః ఢిల్లీలో జరుగుతు న్న కేంద్ర అరాచకాలపై సుప్రీంకోర్టు, హైకోర్టులు ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ,ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్య త వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఢిల్లీలో విద్యార్థులపై జరిగిన లాఠీచార్జీని ఖండిస్తూ సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్‌లో లిబర్టీ చౌరస్తా నుంచి ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ ర్యాలీలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని , సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్యపద్మ, రాష్ట్ర సహాయ కార్యదర్శులు ఈ.టి. నర్సింహ, శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యులు శంకర్, హేమంత్‌రావు, వి.ఎస్.బోస్, ఎమ్మె ల్సీ నెల్లికంటి సత్యం, బొమ్మగాని ప్రభాకర్, పాలమాకుల జంగయ్య, అందోజు రవీంద్రాచారి, జ్యోతి, ఎస్.బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ ఢిల్లీ ఘటనపై విచారణ చేయాలని ఒకరు ఢిల్లీ హైక్టోర్టుకి వెళ్తే విచారణ చేయకుండా ఆ ఘటనలతో తమకు సంబంధంలేదని తమను భాగస్వాములను చేయొద్దని చెప్పడం, మరొకరు సుప్రీంకోర్టుకి వెళ్తే ఇటువంటి వాటితో తమ సమయాన్ని వృధా చేయొద్దని, మీ సమయం వృధా చేసుకోవద్దని, ఇది మాకు సంబంధంలేని అంశం అని చెప్పడం విచారకరమన్నారు. నీట్ పేపర్ లీకేజీ ఘటనకు బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ విద్యారంగాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికే కేంద్రం నీట్ పరీక్షలను నిర్వహిస్తోందన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేతావత్ చంద్రు మృతి బాధాకరం : మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్
AP News | అధిష్టానాన్ని దిక్కరించి అభ్యర్థిని ప్రకటించుకున్న టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్‌డెస్క్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

