కేపీహెచ్బీ కాలనీ, అక్టోబర్ 12 : కూకట్పల్లిలో బతుకమ్మ సంబురాలు ముందుగానే ప్రారంభమయ్యాయి. ఆనవాయితీగా అమావాస్యకు ఒక రోజు ముందు ఇక్కడ ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ప్రారంభం కావాల్సి ఉండగా, శుక్రవారం నాడు పసుపు, కుంకుమ బయటకి వెళ్లకూడదనే ఆచారాన్ని గౌరవిస్తూ గురువారమే ప్రారంభించారు.
హనుమాన్ దేవాలయంతో పాటు పలు చౌరస్తాలలో ఆడపడుచులు ఆటపాటలతో సందడి చేశారు. రంగధాముని చెరువులో బతుకమ్మలను నిమజ్జనం చేసి ప్రసాదాలు స్వీకరించారు.