హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : నగరంలో వాహనదారుల జేబులను ఖాళీ చేసేందుకు సర్కార్ కసరత్తు ప్రారంభించింది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినవారి నుంచి పోలీసుల ప్రమేయం లేకుండా వారి ఖాతాల నుంచి డబ్బులు తీసుకునే వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నది. హెచ్ఎండీఏ హుమ్టా ఆధ్వర్యంలో ఫాస్టాగ్ ద్వారా ట్రాఫిక్ చలాన్లు వసూలు చేసే అంశంపై ట్రాఫిక్ విభాగం నిఘా పెట్టింది.
ఈ విధానం అమలు సాధ్యాసాధ్యాలపై హెచ్ఎండీఏ పనిచేస్తున్నది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వెంటనే నిర్ణీత గడువులోగా జరిమానా మొత్తం సంబంధిత వాహనదారుడి ఫాస్టాగ్ వ్యాలెట్ నుంచి నేరుగా చెల్లించేలా టెక్నాలజీని అనుసంధానం చేయాలని భావిస్తున్నది. ఓఆర్ఆర్, నగర పరిధిలోని ప్రధాన రహదారులపై ఉన్న ఫాస్టాగ్ వ్యవస్థను దీనికి అనుసంధానం చేయడంపై దృష్టి పెట్టింది.