Home
Telangana
Temple Premises Turned Into Classroom For Primary School Students In Rajanna Sircilla
Rajanna Sircilla | బడికి.. గుడి ఆవరణే దిక్కు.. స్కూల్ భవనం కూల్చివేయడంతో విద్యార్థుల అవస్థలు
Rajanna Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చదువుకునేందుకు గుడి ఆవరణే దిక్కయ్యింది. ఇక్కడి పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని పెచ్చులూడుతుండడంతో ఇటీవల దానిని కూల్చి వేశారు. దీంతో పాఠశాల సామగ్రిని పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచారు.
Rajanna Sircilla | ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 26: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అగ్రహారంలో ప్రాథమిక పాఠశాల విద్యార్థులు చదువుకునేందుకు గుడి ఆవరణే దిక్కయ్యింది. ఇక్కడి పాఠశాల భవనం శిథిలావస్థకు చేరుకుని పెచ్చులూడుతుండడంతో ఇటీవల దానిని కూల్చి వేశారు. దీంతో పాఠశాల సామగ్రిని పంచాయతీ కార్యాలయంలో భద్రపరిచారు. ఇటీవలే, గ్రామానికి ప్రీ ప్రైమరీ పాఠశాల మంజూరు కాగా, అక్కడ ఉన్న ఓ చిన్న గదిని దాని కోసం కేటాయించారు.
ప్రీ ప్రైమరీకి మంజూరైన సామగ్రి, వంట సామగ్రిని అందులో భద్రపర్చేందుకు ఇబ్బందికర పరిస్థితి ఉండటంతో, ప్రాథమిక పాఠశాలకు వచ్చే విద్యార్థులకు తరగతి గదుల్లేకుండాపోయాయి. దీంతో హనుమాన్ ఆలయం ఆవరణలోని రేకుల షెడ్డు కిందే విద్యాబోధన చేస్తున్నారు. పాఠశాలకు కొత్త భవనాన్ని మంజూరు చేయించాలని అధికారులను గ్రామస్తులు కోరారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Navaratri Brahmotsavams | నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలి : టీటీడీ అదనపు ఈవో
పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలి : ఎస్పీ రోహిత్ రాజు
Chevella Court | క్రిమినల్ కేసులను చేవెళ్ల కోర్టుకు బదిలీ చేయడం హర్షనీయం
గుర్రంపోడులో రైతులకు హెచ్‌పీఎస్, ఐసీఎంపై శిక్షణ
Rajya Sabha | ఉత్తర ప్రదేశ్ రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవం.. 8 సీట్లు గెలిచిన బీజేపీ.. ఎస్పీకి 2 సీట్లు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

