సిటీబ్యూరో, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : భోజనం చేసేందుకు సికింద్రాబాద్ ప్యారడైజ్ హోటల్‌కు వచ్చిన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సెల్ఫీ దిగేందుకు పలువురు పోటీపడ్డారు. కేటీఆర్ అందరిని ఆప్యాయంగా పలకరించారు. హోటల్ నిర్వాహకులు కేటీఆర్‌తో ముచ్చటించి సెల్ఫీలు దిగారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, గోపీనాథ్, బండారి లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దాస్యం వినయ్ భాస్కర్ తదితరులు ఉన్నారు.
