హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) లింగారెడ్డి కుటుంబాన్ని(Lingareddy family) పరామర్శించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు అబంర్పేట నియోజకవర్గం బాగ్ అంబర్ పేటలోని (Bagh Amberpet) సాయి బాబా కాలనీలో ఇటీవల హత్యకు గురైన రిటైర్ బ్యాంక్ మేనేజర్ లింగారెడ్డి దంపతుల ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తారు. కాగా, సాయిబాబానగర్ కాలనీలో మూడంతస్థుల భవనంలోని కింద ఫ్లోర్లో పి.లింగారెడ్డి(71), ఊర్మిలాదేవి(69) వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. లింగారెడ్డి పంజాబ్ నేషనల్ బ్యాంకులో మేనేజర్‌గా విధులు నిర్వహించి రిటైర్డ్ కాగా.. వీరికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
పెద్ద కుమార్తె కుటుంబం కొంపల్లిలో నివిసిస్తుండగా, మిగిలిన ఇద్దరు అమెరికాలో స్థిరపడ్డారు. గత గురువారం ఉదయం కొంపల్లిలో ఉండే పెద్ద అల్లుడు జైపాల్.. అత్తమామలతో ఫోన్ మాట్లాడి.. తిరిగి శనివారం ఉదయం ఫోన్ చేయగా లిఫ్ట్ చేయలేదు. వెంటనే అదే ప్రాంతంలో ఉండే స్నేహితుడు రవీంద్రకు ఫోన్‌చేసి విషయం చెప్పాడు. అతను ఉదయం 11గంటల సమయంలో వెళ్లి తలుపులు తెరిచి చూడగా.. లింగారెడ్డి, ఊర్మిలా దేవిలు హత్యకు గురై ఉన్నారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.