KTR | హైదరాబాద్‌లోని రోడ్ల దుస్థితికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా తెలంగాణ సచివాలయం ముందే పెద్ద గుంత తవ్వి అలాగే వదిలేయడంపై ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ భారీ గుంతను చూపిస్తూ ట్విట్టర్ (ఎక్స్)లో చేసిన పోస్టుపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ పోస్టుపై స్పందించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. రేవంత్ సర్కార్‌పై సెటైర్లు వేశారు.
శివ అనే నెటిజన్ తన ట్విట్టర్ (ఎక్స్) ఖాతాలో సచివాలయం ముందు ఉన్న భారీ గుంత గురించి వీడియో తీసి పెట్టాడు. సెక్రటేరియట్ ముందే ఇంత పెద్ద గుంత ఉంది. ఎవరైనా సెక్రటేరియట్ చూసుకుంటూ వస్తే ఈ గుంతలో పడి ఛస్తారని ఆందోళన వ్యక్తం చేశాడు. ఇంతమంది పోలీసులు వెళ్తుంటారు. ఇంతమంది జనాలు వెళ్తుంటారు.. అలాంటి చోట ఏంటి గుంతనా అని ప్రశ్నించారు. సీఎం గారూ హుస్సేన్ సాగర్‌ను ఇక్కడ కూడా పెట్టాలని అనుకుంటున్నారా? అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. రోజూ ఎంతోమంది తిరుగుతుంటారు.. దీన్ని క్లోజ్ చేద్దామన్న రెస్పాన్సిబిలిటీ ఉండదా? జీహెచ్ఎంసీ వాళ్లు రోడ్లపై తిరుగుతూ చూడరా? అస్తమానం ఎవరో ఒకరు కంప్లయింట్ ఇస్తేనే తెలుస్తుందా? అని నిలదీశారు. వీలైనంత తొందరగా దీనిపై చర్యలు తీసుకోవాలని కోరాడు. అంతేకాకుండా.. లోపల ఇలాంటివి చాలా ఉన్నాయ్.. లోపల దాచిపెట్టాం అని జీహెచ్ఎంసీ అన్నట్లుగా క్యాప్షన్ పెట్టాడు.
లంకె బిందెల కోసం తవ్వుతున్నారేమో 😁 https://t.co/YG5ikGVEXN
— KTR (@KTRBRS) August 21, 2026
ఈ పోస్టు వైరల్‌గా మారడంతో హైదరాబాద్ రోడ్ల పరిస్థితి, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే కేటీఆర్ కూడా స్పందించారు. లంకెబిందెల కోసం తవ్వుతున్నారేమో అని వ్యంగ్యంగా కామెంట్ పెట్టారు. దీనికి నవ్వుతున్న ఎమోజీని కూడా జత చేశారు. దీంతో కేటీఆర్ కామెంట్ కూడా వైరల్‌గా మారింది.