బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్‌షోకు జన ప్రవాహమై తరలివచ్చింది. జూబ్లీహిల్స్ ప్రచారంలో భాగంగా పార్టీ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతుగా శుక్రవారం రాత్రి వెంగళరావునగర్ డివిజన్‌కు వచ్చిన కేటీఆర్‌కు అడుగడుగునా జనం బ్రహ్మరథం పట్టారు.

కట్టిపడేలా ఆటాపాటలతో ఆ ప్రాంగణమంతా హోరెత్తడంతో గులాబీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నెలకొంది.
ఈ సందర్భంగా రామన్న ప్రసంగానికి ఫిదా అయిన జనం సంతోషంతో సెల్ఫీలు, ఫొటోలు దిగడం కనిపించింది.



