సిటీబ్యూరో, నవంబరు 3 (నమస్తే తెలంగాణ ) : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సమరంలో బీఆర్ఎస్ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నది. అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌కు మద్దతుగా ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు బూత్‌ల వారీగా బాధ్యతలు తీసుకుని ఇంటింటి పాదయాత్ర చేపడుతున్నారు. ఇందులో భాగంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌తో కలిసి మంగళవారం సాయంత్రం సోమాజిగూడ డివిజన్లో రోడ్ షో నిర్వహించనున్నారు.
ఎల్లారెడ్డి హనుమాన్ టెంపుల్ మీదుగా రోడ్ షో సాగి నబ్రా అపార్ట్మెంట్ సమీపంలో కేటీఆర్ ప్రసంగించనున్నారు. కాగా కేటీఆర్ సభకు రావాలని మాజీ కార్పొరేటర్ అట్లూరి విజయలక్ష్మిని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ మహేశ్‌యాదవ్ ఆమెను తన నివాసంలో కలిసి ఆహ్వానించారు.