KTR | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆటో డ్రైవర్ల ఓట్లతో గెలిచి వచ్చి వారికి తీరని అన్యాయం చేస్తున్న తీరును ఎండగడుతూ సోమవారం బీఆర్ఎస్ నేతలంతా హైదరాబాద్ నగరంలో ఆటోలో ప్రయాణించి ఆటో డ్రైవర్ల సాధక బాధాకలు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి తెలంగాణ భవన్ వారికి ఆటోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్ మష్రత్ ఆలీతో కేటీఆర్ గారు మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన పరిస్థితిలను స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.
అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీని తానే స్వయంగా తీసుకువెళ్లాలని వెళ్లానని తెలిపిన ఆలీ ఆ తర్వాత తనకు ఉన్న రెండు ఆటలు అమ్ముకొని ఇప్పుడు డ్రైవర్ గా కూలీగా పనిచేస్తున్నట్లు తన ఆవేదన వ్యక్తం చేశారు. మష్రత్ అలీ పరిస్థితిపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాన్ని మోసాన్ని ప్రతిపక్ష పార్టీగా ఎండగట్టి ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు అమలు అయ్యేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు వస్తామని హామీ ఇచ్చారు. కేటీఆర్ తెలంగాణ భవన్‌కి చేరుకొని.. ఆ తర్వాత అక్కడ జరిగిన ఆటో డ్రైవర్ల సమావేశంలో ప్రసంగించారు.