KTR | SIR కార్యక్రమంపై అవగాహన సదస్సులో భాగంగా నిర్వహించిన బూత్ స్థాయి ఏజెంట్ల సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్హంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. సనత్ నగర్ నుంచి నిన్న సాయంత్రం నాకో చెల్లె ఫోన్ చేసింది. అన్నా నాకో చిన్న బిడ్డ ఉంది.. మూడు రోజుల నుంచి నీళ్లు వస్తలేవు. ట్యాంకర్ బుక్ చేసినా స్పందిస్తలేరని చెప్పిందని అన్నారు. ఇదే విషయమై తలసాని శ్రీనివాస్ యాదవ్ శ్రావణి అనే మహిళకు ఫోన్ చేసి కేటీఆర్‌తో మాట్లాడించారు.
‘శ్రీనన్నకు ఎందుకు ఫోన్ చేసినవ్ శ్రావణి.. ఏమైంది అని కేటీఆర్ అడిగారు. దానికి ఈ ఏరియాలో చాలా నీటి సమస్య ఉంది..మేం ఇటీవలే వనస్థలిపురం నుంచి ఎస్ఆర్ నగర్‌కు షిప్ట్ అయ్యాం. మా ఆఫీస్ అమీర్ పేట్లో. చాలా రోజుల నుంచి ఇక్కడ నీటి సమస్య ఉంది. ఎవరికి ఫోన్ చేసినా పని కావడం లేదంటే మరి శ్రీనన్న నంబర్ నీకెలా దొరికిందని కేటీఆర్ అడిగారు. దానికి ఆయన నంబర్‌ను గూగుల్‌లో వెతికిన అని చెప్పింది శ్రావణి.. ఫోన్ ఎత్తిండా అని కేటీఆర్ అడుగగా శ్రావణి మాట్లాడుతూ.. ఒక్కటే రింగ్.. నేననుకోలే అసలు అయితదని.. మరి శ్రీనన్నకు చెబితే ఏం చేసిండని కేటీఆర్ అడుగగా.. తక్షణమే ఇప్పుడే కాల్ చేయిస్తా అని అన్నవాళ్ల పీఏకు కాల్ చేసిండు. నాకు సరిగ్గా గంటన్నరలో ట్యాంకర్ నా ఇంటి ముందుందని చెప్పింది.
ఆ వెంటనే పని చేసే నాయకులుంటే.. పనికొచ్చే నాయకులుంటే అట్లుంటది శ్రావణి అని’ కేటీఆర్ చెప్పుకొచ్చారు. మహిళ ఎదుర్కొంటున్న నీటి సమస్యను క్షణాల్లోనే పరిష్కరించిన తీరుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
తాగునీటి సమస్య ఉందని తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఫోన్ చేసిన స్థానిక మహిళ
సదరు మహిళతో కేటీఆర్ తో ఫోన్ మాట్లాడించిన తలసాని శ్రీనివాస్ యాదవ్
20 నిమిషాల్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్యాంకర్ పంపించారని చెప్పిన మహిళ pic.twitter.com/Ouv3RMTNFI
— Telugu Scribe (@TeluguScribe) May 16, 2026