మల్టీ టాలెంటెడ్ జీవీ ప్రకాశ్‌కుమార్, కయదు లోహర్ జంటగా నటిస్తున్న డార్క్ ఫాంటసీ సూపర్ నాచురల్ థ్రిల్లర్ ‘ఇమ్మోర్టల్’. మరియప్పన్ చిన్న దర్శకుడు. అరుణ్‌కుమార్ ధనశేఖరన్ నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా నిర్మాణ దశలో ఉన్నది. ఇప్పటికే విడుదల చేసిన పాటకు మంచి స్పందన వస్తున్నదని మేకర్స్ ఆనందం వెలిబుచ్చారు. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాటను మంగళవారం విడుదల చేశారు. ‘షీ ఈజ్ మై లవ్లీ ప్రెట్టీ.. షీ ఈజ్ మై బుజ్జి బ్యూటీ.. షీ ఈజ్ మై హాటీ స్వీటీ..’ అంటూ ఆధునిక ధోరణిలో సాగే ఈ పాటను రాజశ్రీ సుధాకర్ రాయగా, సామ్ పీఎస్ స్వరపరిచారు.
అరవింద్ శ్రీనివాస్ ఆలపించారు. ఈ పాటలో జీవీ ప్రకాశ్‌కుమార్, కయదు లోహర్‌ల మధ్య కెమిస్ట్రీ ఆసక్తికరంగా ఉంది. యువతరం సంగీత ప్రియులను ఆకట్టుకునేలా ఈ పాటను చిత్రీకరించారని తెలుస్తున్నది. టీఎం కార్తీక్, కుమార్ నటరాజన్, ఆదిత్య కతిర్, అర్షు మహర్జన్, సునీతా శ్రేష్ఠ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అరుణ్ రాధాకృష్ణన్, నిర్మాణం: ఏకే ఫిల్మ్ ఫ్యాక్టరీ.