బేగంపేట : బ్రాహ్మణవాడిలోని శ్రీ రామానంద తీర్థ మెమోరియల్ కమిటీ ప్రాంగణంలో విద్యార్థులకు నోటు బుక్కుల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించేందుకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. ముందుగా సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు విగ్రహానికి నివాళులర్పించారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.