కొత్వాల్ హౌస్ పురానీ హవేలీ భవనాన్ని పునరుద్ధరించారు. ఈ భవనాన్ని బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ సీపీ సీవీ ఆనంద్‌తో కలిసి ప్రారంభించారు. ‘ది కొత్వాల్ హౌస్’ భవనం గతంలో పోలీస్ కమిషనర్ కార్యాలయంగా ఉండేదని,1920 నుంచి 2002 వరకు నగర పోలీసు ప్రధాన కార్యాలయంగా పనిచేసిందని నగర సీపీ సీవీ ఆనంద్ గుర్తు చేశారు.
ఈ చారిత్రక కట్టడాన్ని తిరిగి కాపాడినందుకు అందరికీ అభినందనలు తెలిపారు. ఇక నుంచి వారంలో ఒక రోజు శుక్రవారం పురానీ హవేలీ నుంచి, ఒక రోజు బషీర్‌బాగ్‌లోని కార్యాలయం, మిగతా రోజులు బంజారాహిల్స్‌లోని కార్యాలయం నుంచి ప్రజలకు అందుబాటులో ఉంటానని కమిషనర్ తెలిపారు.
– చార్మినార్, జూలై 9