అమీర్‌పేట్, జనవరి 12 : ఉమ్మడి ఏపీ సీఎం, దివంగత కొణిజేతటి రోశయ్య సతీమణి శివలక్ష్మి సోమవారం ఉదయం మృతి చెందారు. సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ధరంకరంరోడ్లోని రోశయ్య నివాసానికి వెళ్లి శివలక్ష్మి పార్థీవదేహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సంతాపం తెలిపిన వారిలో బీఆర్ఎస్ నాయకులు అశోక్‌యాదవ్, ఎం హనుమంతరావు, ప్రవీణ్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, పీపియూషగుప్తా, ఉత్తమ్‌సింగ్ తదితరులున్నారు.