kongarakalan | ఆదిభట్ల, ఏప్రిల్ 7: మా భూములకు భూములు ఇవ్వాలి లేదంటే ప్రభుత్వం నష్ట పరిహరం పెంచి మా భూములకు రేటు ఇవ్వాలని కొంగరకలాన్ రైతులు డిమాండ్ చేశారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ వరకు 300 అడుగుల గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణం కోసం ప్రభుత్వం భూమిని సేకరిస్తుంది.
కొంగరకలాన్ గ్రామంలో రోడ్డు వెడల్పులో భూములు కోల్పోతున్న 22 మందికి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆదేశాల మేరకు భూసేకరణ అధికారులు గత నెల 25వ తేదీన నోటీసులు పంపిణీ చేశారు. దీంతో కొంగరకలాన్ గ్రామంలో హెచ్ఎండీఏ ఏఈ రాజీవ్, రంగారెడ్డి జిల్లా భూసేకరణ అధికారి రాజుతో కలిసి ఇబ్రహీంపట్నం రెవెన్యూ అధికారులు గ్రామసభ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రైతులు తమ గోడు వినిపించారు. తమ భూములకు సమాన విలువైన భూములు ఇవ్వాలని లేదంటే.. నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అధికారులకు రాతపూర్వకంగా వినతిపత్రం అందజేశారు. వినతి పత్రం తీసుకున్న అధికారులు ఎలాంటి సమాధానం చెప్పకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు.
దీంతో కొంగరకలాన్ గ్రామంలో రోడ్డు వెడల్పులో భూములు కోల్పోతున్న 22 మందికి స్పెషల్ డీప్యూటీ కలెక్టర్ భూసేకరణ అధికారులు గత నెల 25 న నోటీసులు పంపిణీ చేసింది.దీంతో సోమవారం రోజునా కొంగరకలాన్ గ్రామంలో హెచ్ ఎం డి ఏ ఏఈ రాజీవ్, రంగారెడ్డి జిల్లా భూసేకరణ అధికారి రాజు తో కలిసి ఇబ్రహీంపట్నం రెవిన్యూ అధికారులు గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేశారు.దీంతో గ్రామంలోని గ్రీన్ పీల్డ్ రోడ్డు 300 ఫీట్ల రోడ్డులో భూములు కోల్పోతున్న రైతుల తో గ్రామ సభ ఏర్పాటు చేశారు.దీంతో రైతులు మా భూములకు భూములు ఇవ్వాలి లేదంటే ప్రభుత్వం నష్ట పరిహరం పెంచి ఇవ్వాలని రైతులు అధికారులకు వ్రాత పూర్వకంగా వినతి పత్రం అందచేశారు.దీంతో వెంటనే అధికారులు రైతుల నుండి తీసుకున్న వినతి పత్రంతో వెనుదిరిగి పోయారు.ఇప్పటికైన ప్రభుత్వం భూములు కోల్పోతున్న రైతుల పై దయతో నష్ట పరిహరం పెంచాలని వారు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామంలోని రోడ్డు ఏర్పాటులో భూములు కోల్పోతున్న రైతులు పాల్గోన్నారు.