Konda Surekha | మంత్రి కొండా దంపతులు నేడు హైదరాబాద్‌లో తమ అనుచచరులతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని కొద్దిసేపట్లోనే సాయంత్రంలోగా రాజీనామా చేయకపోతే, లోక్‌భవన్‌కు బర్తరఫ్ లేఖ పంపిస్తామని హైకమాండ్ హెచ్చరించినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ వ్యవహారంలో నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
మంత్రి వర్గం నుండి కొండా సురేఖను తొలగించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొండా సురేఖను కేబినెట్ నుంచి తక్షణమే తొలగిస్తున్నట్టు సీఎంవో లేఖ విడుదల చేసింది. బర్తరఫ్ లేఖను ఇప్పటికే గవర్నర్‌కు పంపినట్టు పేర్కొంది. ఈ మేరకు లోక్ భవన్ నుంచి కాసేపట్లో ఉత్తర్వులు రానున్నట్టు సమాచారం.
అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల శారద నియమించారు. దీంతోపాటు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ గుండు సుధారాణి నియామకానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
బ్రేకింగ్ న్యూస్
కొండా సురేఖను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేసిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా డా. జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు చేసి ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని నియమించిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా నెరెళ్ల… https://t.co/rkt0Obweqz pic.twitter.com/rls2CaNOV2
— Telugu Scribe (@TeluguScribe) September 3, 2026
Rashmika | భర్త విజయ్‌తో మూడు నెలల తర్వాత ఫుల్ క్వాలిటీ టైమ్.. నేచరే ఇలా చేసిందేమో ..
ACB | సూర్యాపేట టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య నివాసంలో ఏసీబీ మెరుపు దాడులు