Kompalli : కొంపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో దారుణం జరిగింది. ఏడో తరగతి చదువుతున్న సూర్య(Surya) అనే విద్యార్థిపై పదో తరగతి విద్యార్థులతో దాడి ప్రధానోపాధ్యాయుడు కృష్ణ (Krishna) దాడి చేయించాడు. తాను చెప్పిన మాటలు సూర్య వినడం లేదనే కర్కషంతో ఆయన సోమవారం టెన్త్ క్లాస్ విద్యార్థులను పురిగొల్పాడు. వారు సూర్యను తీవ్రంగా కొట్టారు. హెడ్మాస్టర్ కృష్ణ
దుండిగల్ ఎంఈవోగా విధులు నిర్వహిస్తూనే, కొంపల్లి ప్రభుత్వ పాఠశాలకు హెడ్ మాస్టర్‌గా పని చేస్తున్నారు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్లిన సూర్య తనను హెడ్మాస్టర్ కొట్టించిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. తమ బిడ్డ వీపుపై భాగంలోని దెబ్బలను చూసిన వారు కన్నీరుపెట్టుకున్నారు. సూర్య పట్ల అమానుషంగా ప్రవర్తించిన హెడ్మాస్టర్పై పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో వారు ఫిర్యాదు చేశారు.