ఖైరతాబాద్: ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జన ఘట్టం నేడు పూర్తి కానున్నది. మహాగణపతి దర్శనాన్ని సోమవారం నుంచే నిలిపివేయగా, సాయంత్రం 5 గంటల వరకు వినాయకుడి చుట్టూ ఉన్న కర్రలు, షెడ్లు, బారికేడ్లు పూర్తిగా తొలగించారు. పోలీసుల సూచనల మేరకు రాత్రి 9గంటలకే స్వామి వారికి ఉద్వాసన పూజ నిర్వహించి, మహా హారతినిచ్చి కలశాన్ని కదిలించారు.
మంగళవారం ఉదయం 6.30 గంటలకు శోభాయాత్ర ప్రారంభమై మధ్యాహ్నం 1.30 కల్లా ముగుస్తుందన్నారు. మహాగణపతిని ట్రాయిలర్పై ఎక్కించేందుకు హైడ్రాలిక్ క్రూజ్ క్రేన్‌ను వినియోగిస్తున్నారు. 70 అడుగుల ఎత్తులో ఉన్న విగ్రహాన్ని తీసేందుకు ఈ క్రేన్‌కు ఉన్న 142 ఫీట్ల జాక్ ఉపయోగపడుతుందంటున్నారు. కాగా, మహాగణపతి హుండీ ద్వారా రూ.75 లక్షల ఆదాయం సమకూరినట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు. హుండీ లెక్కింపులను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించారు.