Khairatabad | హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌లో వినాయకుడి విగ్రహ నిర్మాణానికి సోమవారం ఘనంగా కర్ర పూజ నిర్వహించారు. ప్రతి ఏడాది నిర్మల ఏకాదశి నాడు కర్ర పూజ నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. కర్రపూజ అనంతరం విగ్రహాన్ని ఇక్కడే రూపొందించనున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే దానం నాగేందర్, గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సారి ఇక్కడ ప్రతిష్టించనున్న మహా గణపతి విగ్రహం ఎత్తును 70 అడుగులుగా కమిటీ ఖరారు చేసింది. వినాయక చవితి సందర్భంగా హైదరాబాద్ ఖైరతాబాద్‌లో ప్రతిష్టించే మహాగణపతి విగ్రహానికి దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంటుంది. విఘ్నాదిపతి విగ్రహం ఎత్తుపై సైతం ఆసక్తి ఉంటుంది.