సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : ఖైరతాబాద్ ఫ్యాన్సీ నంబర్ల వేలంలో రవాణా శాఖకు రూ. 42 లక్షల ఆదాయం సమకూరినట్టు హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ రమేశ్ శుక్రవారం తెలిపారు.
టీజీ09ఎఫ్ 9999 నంబర్ రూ.12 లక్షలకు కీస్టోన్ ఇన్ఫ్రా దక్కించుకుంటున్నట్టు చెప్పారు. 0001 నంబర్‌ను రూ.5.66 లక్షలకు ఎస్ కంపెనీ, 0009 నంబర్‌ను రూ.5.25 లక్షలకు శ్రీనివాస కంస్ట్రక్షన్స్, 0006ను రూ.3 లక్షలకు సాయి సిల్క్స్ దక్కించుకున్నాయి.