మేడ్చల్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా అత్యవసర బృందాలను ఏర్పాటు చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా అత్యవసర బృందాలను ఏర్పాటు చేశారు.మున్సిపల్ కమిషనర్లు సూచించారు. ముంపు ప్రాంతాల గుర్తింపు, వరదనీటి ఇబ్బందులు, నాలా పూడికతీత పనులు, మ్యాన్‌హోళ్ల ఏర్పాటు తదితర వాటిని ఎమర్జెన్సీ బృందాలు గుర్తించి.. మున్సిపల్ కమిషనర్లకు సూచించే విధంగా ఆదేశాలు ఇచ్చారు. అలాగే మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకోనున్నారు. వానలు పడి ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేస్తే ఎమర్జెన్సీ బృందాలు తక్షణ చర్యలు తీసుకుంటాయి.