Maganti Gopinath | జూబ్లీహిల్స్, మే 4: పేదల కోసం కేసీఆర్ రూపొందించిన సంక్షేమ పథకాలకు దేశ వ్యాప్తంగా విశేష ఆదరణ లభించిందని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. రహమత్ నగర్ డివిజన్ కార్మిక నగర్ చౌరస్తాలో జరిగిన కార్యక్రమంలో 10 మంది సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు రూ. 3.04 లక్షల విలువైన చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్దానాలతో దగాపడ్డ అన్ని వర్గాల ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా చిత్తుగా ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేసేందుకు ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రజలను మోసం చేసి అధికారం చేజిక్కించుకోవడం కాంగ్రెస్ పార్టీకే చెల్లిందని.. ప్రజలు మాత్రం తగిన సమయంలో గుణపాఠం చెబుతారని అన్నారు.