బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పార్టీ అధినేత కేసీఆర్ భారీ కటౌట్‌ను
వినూత్నంగా తయారు చేయించారు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్. బంజారాహిల్స్‌లోని తెలంగాణభవన్ వద్ద ఏర్పాటు చేసిన ఈ కేసీఆర్ కటౌట్(సుమారు 50 అడుగుల ఎత్తు) ప్రత్యేకత
అందరినీ ఆకట్టుకుంటోంది.
చెన్నై నుంచి వచ్చిన కళాకారులు ప్రత్యేకంగా భారీ కటౌట్‌ను తయారు చేయడంతో పాటు కేసీఆర్ మోచేయి వెనకభాగంలో మోటర్‌ను బిగించి అభివాదం చేస్తున్న విధంగా కనిపించేలా తీర్చిదిద్దారు. 25 ఏండ్ల బీఆర్ఎస్ పార్టీ ప్రయాణం సందర్భంగా వినూత్నంగా ఏదైనా చేయాలనిపించి ఈ కదిలే కటౌట్‌ను తయారు చేయించామని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు.
– బంజారాహిల్స్, ఏప్రిల్ 16