సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ) : కేబీఆర్ పార్కు టెండర్‌ను ‘మేఘా’ కంపెనీ దక్కించుకున్నది. ఈ పార్కు చుట్టూ రూ. 1090కోట్లతో స్టీల్ బ్రిడ్జిలు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులకు జీహెచ్ఎంసీ టెండర్లను ఆహ్వానించింది. ఈ పనులను దక్కించుకునేందుకు మెగా, ఎంవీఆర్, ఎస్సీసీ కంపెనీలు టెండర్లు దాఖలు చేశాయి. తక్కువకు కోడ్ చేసిన మెగా కంపెనీ ఈ పనులను దక్కించుకున్నది. రెండు రోజుల్లో ఈ కంపెనీకి వర్క్ ఆర్డర్ ఇచ్చేందుకు ఇంజినీరింగ్ విభాగం సన్నద్ధమవుతున్నది.
కేబీఆర్ పార్కు చుట్టూ అగ్రసేన్, ఫిలింనగర్, క్యాన్సర్ హాస్పిటల్, జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు, కేబీఆర్ పార్కు ప్రధాన ద్వారం ఇలా ఆరు జంక్షన్లు ఉన్నాయి. ఈ ఆరు జంక్షన్లలో ఆరు స్టీల్ బ్రిడ్జిలు, ఏడు అండర్‌పాస్‌ల నిర్మాణం జరగనున్నది. జూబ్లీహిల్స్ జంక్షన్, కేబీఆర్ ఎంట్రన్స్ జంక్షన్ వద్ద 2 చొప్పున నాలుగు స్టీల్ బ్రిడ్జిలు రానున్నాయి. మిగతా నాలుగు జంక్షన్ల వద్ద ఒక్కో స్టిల్ బ్రిడ్జి, ఆరు జంక్షన్ల వద్ద ఒక్కొక్కటి చొప్పున 6 అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంకు నుంచి రోడ్డు నంబర్ 45 వైపు వచ్చే ఫ్లై ఓవర్‌పై భాగంలో రెండు లేన్లతో రానున్నది.
కేబీఆర్ పార్కు నుంచి రోడ్ నం. 36 వైపు వెళ్లే 4 లేన్ల కింద నుంచి వెళ్లనుంది. ఈ నిర్మాణాలతో కేబీఆర్ పార్కు గ్రీనరీపై ప్రభావం పడుతుందని గతంలో పలువురు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌ని ఆశ్రయించడం, పర్యావరణ వేత్తలు వ్యతిరేకిస్తుండడం, వీరికి తోడుగా భూ బాధితులు న్యాయస్థానాల్లో పిటిషన్లు వేస్తుండడం ఈ ప్రాజెక్టు ఇప్పట్లో ముందుకు పోయే పరిస్థితులు కనబడటం లేదు. హెచ్ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా మరో చోట అయిన ఖాజాగూడ జంక్షన్, ఐఐఐటీ జంక్షన్, విప్రో జంక్షన్ల వద్ద ఫ్లై ఓవర్ల పనులకుగానూ రూ.837 కోట్ల ప్రాజెక్టును 4.6 ఎక్కువ కోడ్‌తో కేఎన్ఆర్ కంపెనీ దక్కించుకున్నట్లు తెలిసింది.