కట్టమైసమ్మకు కుమ్మరుల తొలిబోనం
ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా లోయర్ ట్యాంక్‌బండ్‌లోని కనకాల కట్టమైసమ్మ ఆలయం వద్ద తెలంగాణ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుమ్మరుల బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది.
- జగదీశ్ మందిర్ నుంచి బోనాలతో మహిళల భారీ ర్యాలీ
కవాడిగూడ, జూన్ 25 : ఆషాఢమాసం బోనాల పండుగ సందర్భంగా లోయర్ ట్యాంక్‌బండ్‌లోని కనకాల కట్టమైసమ్మ ఆలయం వద్ద తెలంగాణ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో కుమ్మరుల బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. వందలాది మంది కుమ్మర మహిళలు బోనాలు ఎత్తుకొని పోతరాజుల నృత్యాలు, బ్యాండ్ మేళాలతో లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా కనకాల కట్టమైసమ్మ ఆలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా వచ్చి అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పించి పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి పశసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, కార్పొరేటర్ రచనశ్రీ, మాజీ కార్పొరేటర్ వి. శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ గ్రేటర్ సీనియర్ నాయకుడు ఎమ్మెన్ శ్రీనివాస్ రావు, రాష్ట్ర యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహతో కలిసి ప్రారంభించారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
అనంతరం మంత్రి తలసాని మాట్లాడుడూ మన సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాలు, బతుకమ్మ వేడుకలు నేడు విశ్వవ్యాప్తం అయ్యాయన్నారు. బోనాల ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని వివిధ దేవాలయాలకు ఆర్థిక సహాయం అందించడం కోసం ప్రభుత్వం రూ. 15 కోట్లు విడుదల చేసిందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ కుమ్మర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నడికుడ జయంత్ రావు, ప్రధాన కార్యదర్శి దయానంద్, సంఘం అసోసియేషన్ అధ్యక్షుడు కుమ్మరి లక్ష్మీనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రావులకోలు వీరేశం, హనుమంతరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగనూరి నాగేశ్, బోనాల కమిటీ చైర్మన్ నిమ్మలూరి శ్రీనివాస్, సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్, కోశాధికారి నెదునూరి శ్రీనివాస్, రాష్ట్ర నాయకుడు కల్వగోపీ, బీఆర్ఎస్ కవాడిగూడ డివిజన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వల్లాల శ్యామ్ యాదవ్, ఎన్డీ సాయికృష్ణ, మధు తదితరులు పాల్గొన్నారు.
కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని..
తెలంగాణ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో ఆదివారం ట్యాంక్‌బండ్ సమీపంలో కంకాలమ్మ తల్లి అమ్మవారికి 516ల బోనాలతో అమ్మవారికి ప్రసాదాన్ని సమర్పించే కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యుడు ఉపేంద్ర పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసినట్లు ఉపేంద్ర వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కుమ్మరి సంఘం నాయకులు బిక్షపతి, లక్ష్మీ నారాయణ, శ్యామ్, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

