e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home హైదరాబాద్‌ ఆకలితో అలమటించకుండా..

ఆకలితో అలమటించకుండా..

ఆకలితో అలమటించకుండా..

సిటీబ్యూరో, మే 17(నమస్తే తెలంగాణ): లాక్‌డౌన్‌లో ఎవరూ పస్తులుండవద్దని భావించి.. వారి ఆకలి తీర్చడానికి చాలామంది దాతలు ముందుకు వస్తున్నారు. తమకు చేతనైనంత సాయం చేస్తూ.. పేదల ఆకలి తీరుస్తున్నారు. కరోనా-లాక్‌డౌన్‌తో ఇబ్బంది పడుతున్న అభాగ్యులకు బాసటగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో హయత్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ‘కస్తూరి ఫౌండేషన్‌’.. పేదలు, యాచకులు, లారీ డ్రైవర్లు, అంబులెన్స్‌ డ్రైవర్లు, అనాథలు, మతిస్థిమితం సరిగ్గా లేనివారి ఆకలిని తీర్చేందుకు ముందుకు వచ్చింది. ఈ సంస్థ లాక్‌డౌన్‌ ప్రారంభం నుంచి నిత్యం హయత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు, బండ్లగూడ చౌరస్తాలో అన్నదానం చేస్తున్నది. ఈ రెండు ప్రాంతాల్లో ప్రతి రోజు మధ్యా హ్నం దాదాపు 400 మందికి భోజనం పెడుతున్నారు. లాక్‌డౌన్‌ పూర్తయ్యే వరకు ఈ భోజన సౌకర్యాన్ని అందిస్తామని కస్తూరి ఫౌండేషన్‌ చైర్మన్‌ చరణ్‌ కస్తూరి, ప్రతినిధి రామకృష్ణ తెలిపారు. అలాగే.. ఈ సంస్థ గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు నోట్‌బుక్స్‌, పెన్సిల్స్‌, స్కూల్‌ బ్యాగ్స్‌, మధ్యాహ్న భోజనం కోసం ప్లేట్లను అందిస్తున్నది. అదే విధంగా పదవ తరగతి విద్యార్థులకు ఆల్‌ ఇన్‌ వన్‌ గైడ్‌లను కూడా అందజేస్తున్నది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆకలితో అలమటించకుండా..

ట్రెండింగ్‌

Advertisement