సిటీబ్యూరో, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో కంటివెలుగు 48వ రోజుకు చేరుకున్నది. సోమవారం 274 కేంద్రాల్లో 24,569 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 3087 మందికి రీడింగ్ గ్లాసెస్‌ను పంపిణీ చేయగా 1500 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్ కోసం సిఫారసు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ జిల్లాలో..
నగరంలో 115 కేంద్రాల్లో 48వ రోజు మొత్తం 8556 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు హైదరాబాద్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. వారిలో 1263 మందికి రీడింగ్ గ్లాసెస్‌ను పంపిణీ చేసి, 699 మంది రోగులకు ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్‌ను సిఫారసు చేసినట్లు చెప్పారు.
రంగారెడ్డి జిల్లా పరిధిలో..
జిల్లా పరిధిలో మొత్తం 80 కేంద్రాల ద్వారా కంటి వెలుగు పరీక్షలు జరిపినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. 48వ రోజు జిల్లా వ్యాప్తంగా మొత్తం 7326 మందికి కంటి పరీక్షలు జరిపామని, వారిలో 1029 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేసి, 421 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్‌ను సిఫారసు చేశామన్నారు.
మేడ్చల్ జిల్లా పరిధిలో..
జిల్లా పరిధిలో మొత్తం 79 కేంద్రాల ద్వారా 48వ రోజు 8687 మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ పుట్ల శ్రీనివాస్ వెల్లడించారు. వారిలో 795 మందికి రీడింగ్ గ్లాసెస్ పంపిణీ చేసి, 380 మందికి ప్రిస్క్రిప్షనరీ గ్లాసెస్‌ను సిఫారసు చేసినట్లు తెలిపారు.