Get together | కందుకూరు , ఏప్రిల్ 29 : దాదాపు 15 ఏళ్ల తర్వాత స్నేహితులంతా ఒక్కచోట కలుసుకున్నారు. రోజంతా ఆటపాటలతో ఎంజాయ్ చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. హైదరాబాద్ శివారు కందుకూరు మండలం నేదునూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో 2009-10లో పదో తరతి చదువుకున్న విద్యార్థులు మంగళవారం నాడు ఒక చోట చేరారు.
పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో భాగంగా తమకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. పదో తరగతి చదువుతున్న సమయంలో తరగతి గదుల్లో చేసిన చిలిపి చేష్టలను నెమరేసుకున్నారు. రోజంతా ఆటపాటలతో గడిపారు. అందరూ కలిసి సహపంక్తి భోజనం చేశారు.