హిమాయత్‌నగర్,ఏప్రిల్17: తెలంగాణను అవమానించిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య సభ్యత్వంను రద్దు చేయాలని ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరి ధర్మేంద్ర,రాష్ట్ర కార్యనిర్వహక అధ్యక్షుడు ఎన్.శ్రీకాంత్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైనా తెలంగాణ రాష్ర్టాన్ని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం హిమాయత్ నగర్ వైజంక్షన్‌లో బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య దిష్టి బొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై తేజస్వీ సూర్య అహంకార వ్యాఖ్యలను నేరుగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.
వేలాదిమంది యువత తమ ప్రాణాలను అర్పించిన ఉద్య మాన్ని అవమానించే హక్కు ఎవరికీ లేదని, బీజేపీ పార్టీ మతం-ప్రాంతం పేరిట విభ జించి ప్రాంతీయ విభేదాలను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధిపొందాలని చూస్తుందని విమర్శించారు.ప్రజాస్వామ్యాన్ని బలహీన పరిచే ఈ విధమైన వ్యాఖ్యలను దేశ ప్రజలు క్షమిం చారని మండిపడ్డారు.తేజస్వీ సూర్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తెలంగాణ ప్రజలకు బహిరంగ క్షమాపణలు చేప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నగర నేతలు ఆర్.బాలకృష్ణ, సల్మాన్‌బేగ్,కాంపల్లి కల్యాణ్,మహ్మద్ అక్రమ్,లక్ష్మణ్,నదీమ్,రవి,మురళి,ప్రదీప్ పాల్గొన్నారు.