సిటీబ్యూరో, సెప్టెంబర్ 16(నమస్తే తెలంగాణ) : బంజారాహిల్స్ రోడ్ నం 1లోని జలగం వెంగళరావు (జేవీఆర్) పార్కు అభివృద్ధికి తెలంగాణ ఫెసిలిటీ ప్రమోషన్ సంస్థ ముందుకు వచ్చింది. సీఎస్ఆర్ పద్ధతిలో స్వంత నిధులతో అభివృద్ధి చేయనున్నది. ఈ మేరకు శనివారం సంస్థ ప్రతినిధులతో కలిసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్ రోస్ జేవీఆర్ పార్కును సందర్శించారు. జేవీఆర్ పార్కులో ల్యాండ్‌స్కేప్, పాండ్, వాటర్ క్వాలిటీ ఇతర అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు మేయర్ పేర్కొన్నారు.
నగరంలో పార్కుల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు కమిషనర్ రోనాల్డ్ రోస్ తెలిపారు. ఇందిరాపార్కు అభివృద్ధికి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. జేవీఆర్ పార్కులో వర్షపు నీటిని సీవరేజ్ డ్రైన్‌ను మళ్లింపునకు రూ.67 లక్షల వ్యయంతో చేపట్టినట్లు కమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్, మేయర్ వాకర్స్‌తో మాట్లాడి పార్కులో సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు.