Jubleehills | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన మహిళలు.. కాంగ్రెస్ మంత్రులపై దుమ్మెత్తిపోస్తున్నారు. భర్త చనిపోయిన మహిళ ఏడిస్తే.. ఆమెను పట్టుకుని డ్రామాలు అనడం సరికాదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఈ ఉప ఎన్నికల్లో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మాగంటి సునీత కుమార్తె బస్తీల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వృద్ధ మహిళలను ఆమె పలుకరించారు. మాగంటి గోపీనాథ్ చేసిన సేవలను గుర్తు చేస్తూ.. కారు గుర్తుకు ఓటేయాలని సునీత కుమార్తె కోరారు.
దీంతో పలువురు మహిళలు మాట్లాడుతూ.. కాంగ్రెస్ మంత్రులపై మండిపడ్డారు. భర్త లేని వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది.. మనిషి అయితే కాంగ్రెస్ మంత్రులు మాగంటి సునీతను ఆ మాట అనరు. వాళ్ళు సచ్చిపోతే వాళ్ల పెళ్ళాలు ఏడవరు.. తల్లిదండ్రులు సచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళు ఏడ్చి ఉండరు అని మహిళలు పేర్కొన్నారు.
భర్త లేని వాళ్ళకే ఆ బాధ తెలుస్తుంది.. మనిషి అయితే కాంగ్రెస్ మంత్రులు మాగంటి సునీతను ఆ మాట అనరు
వాళ్ళు సచ్చిపోతే వాళ్ల పెళ్ళాలు ఏడవరు.. తల్లిదండ్రులు సచ్చిపోయినప్పుడు కూడా వాళ్ళు ఏడ్చి ఉండరు
మాగంటి గోపీనాథ్ కూతురు ముందు కాంగ్రెస్ మంత్రులకు గడ్డిపెట్టిన మహిళలు https://t.co/DF8CVXRiA0 pic.twitter.com/BOfSVrWeDT
— Telugu Scribe (@TeluguScribe) October 16, 2025