జూబ్లీహిల్స్: సర్‌లో అర్హుల ఓట్లు తొలగకుండా.. అప్రమత్తంగా ఉంటే రానున్న ఏ ఎన్నికల్లోనైనా బీఆర్ఎస్ విజయం తథ్యమని బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఇన్చార్జి మాగంటి సునీతాగోపీనాథ్ పేర్కొన్నారు. ఎస్ఐఆర్తో పాటు బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించే జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శుక్రవారం యూసుఫ్‌గూడలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాగంటి సునీతా గోపీనాథ్ మాట్లాడారు.
ఎస్ఐఆర్లో భాగంగా ప్రతి ఓటరుకు ఎన్యుమరేషన్ ఫారాలు అందేలా చూడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై ఉందన్నారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించనున్న సర్వసభ్య సమావేశంలో కార్యకర్తలకు, నాయకులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఈ సమావేశంలో వివిధ డివిజన్లకు చెందిన సీనియర్ నాయకులు కృష్ణమోహన్, చంద్రశేఖర్, అప్పూఖాన్, నవీన్ పోగుల, ఆనంద్, మధు, సల్ల శ్రీనివాస్ యాదవ్, నాగరాజు, రామకృష్ణ, చిన్నరమేశ్, అజయ చౌదరి, అమ్మాజీ, ఫహీం తదితరులు పాల్గొన్నారు.