బంజారాహిల్స్, అక్టోబర్ 23 : ‘పదేళ్లు మాకు ఏ కష్టం వచ్చినా మీ నాన్న అండగా నిలబడ్డాడు.. మీకు కష్టమొస్తే మేము నిలబడమా.. మీరు ఏం ఫికర్ చేయకండి అమ్మా.. మీ అమ్మకే ఓటేస్తాం.. కారు గుర్తును మర్చిపోం..’ అంటూ దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు మాగంటి అక్షర, దిశిరకు జూబ్లీహిల్స్ ఓటర్లు భరోసా ఇస్తున్నారు. నెలరోజులుగా నియోజకవర్గంలోని గడపగడపకు తిరుగుతూ తమ తల్లి మాగంటి సునీతాగోపీనాథ్కు మద్దతు పలకాలంటూ కోరుతున్నారు.
ఎక్కడకు వెళ్లినా ఆప్యాయంగా పలకరిస్తున్న ఓటర్లు ఎమ్మెల్యే గోపీనాథ్‌ను గుర్తుచేసుకుంటూ కన్నీళ్లు పెట్టుకోవడంతో పాటు అక్కున చేర్చుకుంటున్నారు. మా గోపన్న అంటూ తమకున్న అనుబంధాన్ని గుర్తుచేస్తున్న మహిళలు క చ్చితంగా తాము మాగంటి సునీతను గెలిపిస్తామంటూ హామీ ఇస్తున్నారు. బోరబండ, రహ్మత్‌నగర్, వెంగళ్రావునగర్, యూసుఫ్‌గూడ, ఎర్రగడ్డ డివిజన్లలో ఇప్పటికే పలు బస్తీల్లో ప్రచారం నిర్వహించిన మాగంటి కుమార్తెలకు ‘మీ నాన్నకోసం అమ్మను గెలిపిస్తాం..’ అంటూ ఒట్టేసి చెబుతున్నారు.