జూబ్లీహిల్స్, సెప్టెంబర్ 16 : ఏ కష్టమొచ్చినా గోపన్న మాకు అండగా నిలబడ్డాడు.. మీకు కష్టమొచ్చినప్పుడు తాము అండగా నిలబడుతాం.. ఆయన వారసులుగా మీరు నిలబడండి.. మేము గెలిపిస్తాం.. అంటూ యూసుఫ్‌గూడలో స్థానికులు మాగంటి తనయలకు అభయమిస్తున్నారు. మంగళవారం కృష్ణానగర్ కాలనీలో పర్యటించిన మాగంటి అక్షరను స్థానికులు ఆత్మీయంగా అక్కున చేర్చుకున్నారు.
డివిజన్లలో పర్యటిస్తున్న దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కుమార్తెలు అక్షర, దిశిరలకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తుంది. కృష్ణానగర్ కాలనీ వాసులను ఆప్యాయంగా పలకరిస్తూ వెళ్లిన మాగంటి అక్షరను పొట్లూరి లక్ష్మి అనే మహిళ ఆలింగనం చేసుకుని కన్నీటి పర్యంతమైంది. నా భర్త చనిపోయి 5 సంవత్సరాలైంది.. నన్ను ఆదుకునే వారులేని సమయంలో గోపన్న బీసీబంధు ఇచ్చి ఆదుకున్నాడు.. నాలాగా ఎంతోమందికి గోపన్న అండగా నిలబడ్డాడు.. కష్టకాలంలో ఆదుకున్నాడని లక్ష్మి తెలిపారు.