సిటీబ్యూరో, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రత్యేక అవసరాల పిల్లల కోసం మంగళవారం మెట్రో జాయ్ రైడ్ నిర్వహిస్తున్నట్లు హెచ్ఎంఆర్ అధికారులు వెల్లడించారు.
అమీర్పేట నుంచి మియాపూర్, అక్కడి నుంచి తిరిగి అమీర్పేట వరకు ఈ రైడ్ ఉంటుందన్నారు. విద్యార్థులతో డ్రాయింగ్ ఎగ్జిబిషన్, నృత్య ప్రదర్శనలు సైతం ఉంటాయని తెలిపారు.