సిటీబ్యూరో, ఏప్రిల్ 15(నమస్తే తెలంగాణ): కేరళలోని త్రిసూర్ యొక్క కాలాతీత స్వర్ణ వారసత్వాన్ని నిర్మస్తూనే భారతదేశ బంగారు మార్కెట్‌కు నిర్మాణం, నమ్మకాన్ని తీసుకొచ్చిన మార్గదర్శక వ్యవస్థాపకుడు జోస్ అలుక్కాస్ అని కేంద్ర మంత్రి సురేశ్ గోపి, ఆ రాష్ట్ర మంత్రులు కె.రాజన్(రెవెన్యూ), డాక్టర్ ఆర్.బింద్(ఉన్నత విద్యా), జోస్ అలుక్కాస్ బ్రాండ్ అంబాసిడర్, ఫిల్మ్ అండ్, టెలివిజన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఆర్. మాధవ్ కొనియాడారు. త్రిసూర్‌లోని లులు హయత్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన కార్యక్రమంలో జోస్ అలుక్కాస్ ఆత్మకథ ‘గోల్డ్’ పుస్తకాన్ని వారు ఆవిష్కరించారు. జోస్ అలుక్కాస్ మాట్లాడుతూ.. నేను భారతదేశ బంగారు రాజధాని త్రిసూర్ నుంచి ప్రారంభించాను, నా 81 ఏండ్ల జీవితం వ్యక్తిగతమైనది మాత్రమే కాదు, భారతీయ ఆభరణాల వ్యాపార చరిత్ర ద్వారా ఒక ప్రయాణం కూడా అని అన్నారు.
ఈ పుస్తకం నన్ను నేనేమిటో తెలియజేసిన కథ.. అంతేకాకుండా ఇది త్రిసూర్ కథ అని జోస్ అలుక్కాస్ అన్నారు. జోస్ అలుక్కాస్ వ్యాపారం పట్ల ఆయనకున్న మక్కువ, అంకితభావాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను.. ఆయనను తెలుసుకోవడం ఒక దిగ్గజాన్ని తెలుకున్నట్లే, బంగారు వ్యాపారం కొన్నింటికే పరిమితమైన సమయంలో ఆయన ప్రారంభించి.. దానిని పూర్తిగా మార్చారని ఆర్.మాధవ్ వివరించారు. ఆయన ఆత్మకథ గోల్డ్, ఈ అసాధారణ పరివర్తనను సంగ్రహించిందన్నారు. ఇది ధైర్యసాహసాలు, ఆవిష్కరణలు, అంతరాయం యొక్క కథ అని అన్నారు.
ఒక దృఢ నిశ్చయం కల్గిన యువకుడు పెద్ద కలలు కనే ధైర్యం చేసి భారతదేశంలో మొట్టమొదటి వ్యవస్థీకృత బంగారు షోరూమ్‌ను ఎలా నిర్మించాడో, దేశ వ్యాప్తంగా ఆభరణాల రిటైల్, వినియోగదారుల అంచనాలను ఎలా విప్లవాత్మకంగా మార్చాడో, గొడుగు వ్యాపారాన్ని నడిపిన కుటుంబం నుంచి వచ్చిన ఒక యువకుడు సాహసోపేతమైన ప్రయాణాన్ని ఆత్మకథ వివరిస్తుంది.. అతడు ధైర్యంగా బంగారం వ్యాపారంలోకి అడుగుపెట్టి శాశ్వత వారసత్వాన్ని సృష్టించాడని ఆయన కొనియాడారు.
ఈ పుస్తకం భారతదేశ రిటైల్ బంగారం మార్కెట్లోకి 916 బంగారం స్వచ్ఛతను ప్రవేశపెట్టడంలో ఆయన మార్గదర్శక పాత్రను కూడా హైలెట్ చేస్తుందన్నారు. అతడు తన సోదరులను వ్యాపారంలోకి ఎలా తీసుకువచ్చాడో, అలుక్కాస్ జ్యువెలరీని ప్రపంచ బ్రాండ్‌గా ఎలా విస్తరించాడో వివరిస్తుందన్నారు. కాగా, ఈ పుస్తకంలో ముందుమాట రాసిన ప్రఖ్యాత మలయాళ నవలా రచయిత టీడీ రామకృష్ణన్ ఈ పుస్తకాన్ని పరిచయం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పాల్గొన్నారు.