సిటీబ్యూరో: జలమండలి ఈడీగా విధులు నిర్వర్తిస్తున్న మయాంక్ మిట్టల్‌ను జాయింట్ ఎండీగా నియమితులయ్యారు. కొత్త విభజన ప్రకారం మూడు జోన్లకు సర్కారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లను కూడా ఖరారు చేసింది.
అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్ (యూసీడీ) అదనపు కమిషనర్ ఎస్. పంకజను మల్కాజిగిరి ఈడీగా, హైదరాబాద్ ఈడీగా సామ్రాట్ అశోక్, ఎం. సంతోష్ సైబరాబాద్ ఈడీగా నియమించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన జాయింట్ ఎండీ, ఈడీలు జలమండలి ఎండీ అశోక్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు.