కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 4 : శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. హైదర్‌నగర్ డివిజన్‌కు చెందిన కాంగ్రెస్ నేత, ఉద్యమకారుడు సిద్దం శ్రీకాంత్, డివిజన్ మాజీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణలతో పాటు 50 మంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు… ఆ పార్టీకి రాజీనామా చేసి, కూకట్పల్లి ఎమ్మెల్యే, శేరిలింగంపల్లి బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జీ మాధవరం కృష్ణారావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ నేతలు ఎన్నికలప్పుడు అబద్ధపు హామీలు, బూటకపు మాటలు ప్రజలు నమ్మి మోసపోయారని, ఏడాది కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు విసుగు చెందిన ప్రజలు, ఆ పార్టీ నేతలు తిరిగి బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.
ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలమైనా ఇప్పటివరకు ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేయలేదని, పేదలకు పింఛన్లు పెంచలేదని, రైతుబంధు ఇవ్వలేదని, పేదిండి ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మితో తులం బంగారం ఇవ్వలేదని, ఇలా ఎన్నో హామీలను మర్చిపోయారన్నారు. ఏడాది పూర్తైందని కాంగ్రెస్ ప్రభుత్వం సంబురాలు చేసుకోవడం బాధాకరమన్నారు. ప్రజలకు ఏం మేలు చేశారని, సంక్షేమ ఫలాలు ఇచ్చారని సంబురాలు చేసుకుంటున్నారో చెప్పాలని ప్రశ్నించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ రంగారావు, ఎర్రబెల్లి సతీశ్‌రావు, పెద్ద భాస్కర్, నర్సింగరావు, విష్ణు, రషీద్, రాము, షాదుల్లా, రవీందర్, బాలరాజు యాదవ్, రబ్బానీ, నరేందర్‌రెడ్డి, సాజిత్, రాంబాబు, వెంకట్రావు, షరీఫ్, హమీద్, సత్తార్ తదితరులు పాల్గొన్నారు.