సిటీబ్యూరో, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ సిటీ పోలీస్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్‌గా జోయల్‌డేవిస్ సోమవారం పదవీబాధ్యతలు స్వీకరించారు.
2010 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన జోయల్‌డేవిస్ సైబరాబాద్ ట్రాఫిక్ విభాగం జాయింట్ కమిషనర్‌గా వ్యవహరించగా ఐపీఎస్ బదిలీలలో డేవిస్‌ను హైదరాబాద్ ట్రాఫిక్‌కు బదిలీ చేశారు. ఈనేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేస్తానని జోయల్ డేవిస్ తెలిపారు.