సికింద్రాబాద్ : నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల కల పరిపూర్ణం అయ్యింది….. పోరాడి సాధించిన ప్రత్యేక రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు కల నెరవేర్చిన ఘనత సైతం ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కింది. బుధవారం రాష్ట్ర అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయడంపై సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, నిరుద్యోగుల్లో హర్షాతీరేఖలు వ్యక్తం అయ్యాయి.
సీఎం కేసీఆర్ ప్రకటన నేపథ్యంలో కంటోన్మెంట్‌లోని ఎమ్మెల్యే సాయన్న క్యాంపు కార్యాలయం, కంటోన్మెంట్ ప్లే గ్రౌండ్, రెండవ వార్డు రసూల్పురాల్లో ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్‌రెడ్డి, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్‌రెడ్డిల ఆధ్వర్యంలో బాణాసంచా కాల్చి, సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.
జై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు. దీంతో పాటు తిరుమలగిరిలోని పార్టీ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేష్ నేతృత్వంలో పార్టీ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు. ఆదే విధంగా రెండవ వార్డులో బోయిన్పల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ నేతృత్వంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేశారు. ప్రభుత్వ ఉద్యోగాలను ఇంత పెద్ద ఎత్తున దేశంలోని ఏ రాష్ట్రంలోనూ భర్తీ చేయలేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
కార్యక్రమంలో బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, పాండుయాదవ్తో పాటు నేతలు నివేదిత, ముప్పిడి మధుకర్, దేవులపల్లి శ్రీనివాస్, మహంకాళి శర్విన్, ప్రవీణ్‌యాదవ్, పిట్ల నాగేష్, భాస్కర్ ముదిరాజ్, నర్సింహ్మారావు, హాసీన్ఖాన్, శ్రీనివాస్, కుమార్, రామకృష్ణ, ఆశోక్, ధన్‌రాజ్, నర్సింహ్మా, గౌస్, ఉస్మాన్, మహేశ్, చంద్రకాంత్, ఇస్మాయిల్‌తో పాటు తదితరులు పాల్గొన్నారు.