దుండిగల్ / కుత్బుల్లాపూర్, మార్చి17: విద్యార్థులు నాలుగు సంవత్సరాల ఇంజినీరింగ్ విద్యను కష్టపడి పూర్తి చేస్తే… నలభై ఏండ్ల పాటు స్థిరపడే అవకాశం లభిస్తుందని కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ డైరెక్టర్ డా.జే.శ్రీనివాసరావు అన్నారు. కుటుంబంలో ఒక్కరు సెటిల్ అయితే మరో మూడు తరాలు సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేటలోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాల బాయ్స్ క్యాంపస్‌లో గురువారం సాయంత్రం నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, కేఎల్ డీమ్డ్ యూనివర్సీటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్యవక్తగా హాజరైన యూనివర్సిటీ డైరెక్టర్ డా.జే.శ్రీనివాసరావు మాట్లాడుతూ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలంటే ఇంటర్ తర్వాత ఇంజినీరింగ్ కళాశాలల ఎంపిక చాలా ముఖ్యమని చెప్పారు.
దేశంలో మొత్తం వెయ్యికి పైగా కళాశాలలు ఉండగా కేఎల్ డీమ్డ్ యూనివర్సీటీ 32వ స్థానంలో ఉందన్నారు. ఇంటర్లో 90శాతం ఆ పైన మార్కులు సాధించిన విద్యార్థులకు కేఎల్ యూనివర్సిటీ ఫీజు రాయితీ కల్పిస్తుందని చెప్పారు. 96 శాతం మార్కులు సాధించిన వారికి పూర్తిగా ఉచితంగా విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం కేఎల్ డీమ్డ్ యూనిర్సీటిలో ఇంజినీరింగ్ చదువుతూ రూ. 44 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగం సంపాందించిన డనీష కర్రితో పాటు అమె తల్లిదండ్రులు శివనాగేశ్వరి వెంకటేశ్వర్రావు దంపతులను నిర్వాహకులు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య నిజాంపేట బాయ్స్ క్యాంపస్ డీన్ చంద్రబాబు, ప్రిన్సిపాల్ బాలకృష్ణ, నమస్తే తెలంగాణ హైదరాబాద్ ఎడిషన్ ఇన్చార్జి చిరంజీవి ప్రసాద్, నమస్తేతెలంగాణ దినపత్రిక ఏజీఎం రాజిరెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.
కేఎల్ డీమ్డ్ యూనివర్సీటీ గైడెన్స్‌తోనే..
ఇంటర్లో 93 శాతం మార్కులు వచ్చాయి. ఎంసెట్ రాయలేదు. చివరి నిమిషంలో కేఎల్ యూనివర్సీటీలో చేరాను. ఫీజు చెల్లించే స్థోమత లేకపోవడంతో కళాశాల యాజమాన్యమే విద్యా లక్ష్మీ పోర్టల్ ద్వారా విద్యారుణం ఇప్పించారు. అది కూడా చదువు పూర్తి అయిన ఏడాది తర్వాత ఈఎంఐ పద్ధతుల్లో చెల్లించాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా బీ.టెక్, ఎంటెక్ చదివే 4500 మంది విద్యార్థులు ఆన్లైన్ రాసిన ‘విమెన్ కోడ్ టు విన్’ పరీక్షను థర్డ్ ఇయర్లో రాయగా మొదటి ర్యాంకు వచ్చింది. దీంతో మల్టీనేషనల్ కంపెనీలు 44 లక్షల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేశాయి. చదువు పూర్తైన వెంటనే ఉద్యోగంలో చేరుతా. ఇందుకు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ అందించిన గైడెన్స్ ఎంతగానో ఉపయోగపడింది. – డనీష, బి.టెక్ సీఎస్ఈ మూడో సంవత్సరం విద్యార్థిని
కెరీర్‌కు ఉపయోగపడుతుంది
కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు చూపించిన మార్గదర్శకాలు విద్యార్థులకు జీవితంలో స్థిరపడేందుకు చక్కగా ఉపయోగపడతాయి. వారు సూచించిన పద్ధతుల్లో ప్రణాళికబద్ధంగా చదువుకుని ముందుకెళ్తే ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. టెక్నికల్‌గా ముందుకు వెళ్లాలంటే కెరీర్ గైడెన్స్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించడం అభినందనీయం.
– సాయివరుణ్, విద్యార్థి
డనీషను స్ఫూర్తిగా తీసుకుంటా
కేఎల్డీమ్డ్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ చదువుతూ మూడవ సంవత్సరంలోనే మల్టీనేషనల్ కంపెనీలో రూ.44 లక్షల వార్షిక వేతనానికి ఎంపికైన డనీషను స్ఫూర్తిగా తీసుకొని బాగా చదువుతా. ఆమెను ఆ స్థాయికి వెళ్లేందుకు ప్రోత్సహించిన కేఎల్ డీమ్డ్ యూనివర్సీటీకి అభినందనలు. ఇతర కళాశాలల ఎంపికపై కూడా అవగాహన పెంచుకునేలా కేఎల్ యూనివర్సిటీ ప్రతినిధులు తెలియజేయడం సంతోషకరం. – అవినాశ్, విద్యార్థి
మంచి క్యాంపస్‌ను సెలెక్ట్ చేసుకున్నా..
ఇంటర్ తర్వాత ఉన్నత స్థానాలను సాధించాలంటే కేఎల్ డీమ్డ్ యూనివర్సీటీ నిర్వాహకులు ఇచ్చిన అవగాహన ఎంతో అవసరం. చదువుకోవాలనే కసితో ముందుకు వెళ్తున్న తరుణంలో ఇలాంటి అవగాహన ద్వారా లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన అవగాహన ద్వారా విద్యార్థులకు చాలా ఉపయోగపడింది. మంచి క్యాంపస్‌ను సెలెక్ట్ చేసుకునే ఆలోచనను ఇచ్చింది. – మనోహర్, ఇంటర్ విద్యార్థి
విద్యార్థులకు ప్రేరణ బాగుంది
కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులకు కల్పిస్తున్న ప్రేరణ బాగుంది. మట్టిలోని మాణిక్యాలను వెలికితీసే మంచి గుణం శ్రీనివాసరావుది. కరోనా తర్వాత ఇంజినీరింగ్ చదవాలనుకునే ఇంటర్ విద్యార్థులకు కేఎల్ యూనివర్సిటీ సరైన గైడెన్స్ ఇవ్వడం అభినందనీయం. విద్యార్థుల్లో మార్పులు తీసుకొచ్చేందుకు కేఎల్ యూనివర్సీటీ చేస్తున్న కృషి బాగుంది.
– రవికుమార్, శ్రీచైతన్య కళాశాలల ఏజీఎం
విద్యార్థులకు సరైన గైడెన్స్..
నమస్తే తెలంగాణ, తెలంగాణ టు డే పత్రికలు తెలంగాణ సమాజానికి ప్రతిబింబాలుగా పని చేస్తున్నాయి. సమాజానికి ఉపయోగపడాలనే సంకల్పంతో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీతో జతకట్టాం. ఇంటర్ విద్యార్థులకు సరైన గైడెన్స్‌ను అందజేస్తున్నాం. ఇంజినీరింగ్‌లో రాణించాలని అనుకునే విద్యార్థులకు మంచి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం.
– సురేందర్‌రావు, నమస్తే తెలంగాణ అడ్వైర్టెజ్‌మెంట్ జీఎం
చాలా సంతోషంగా ఉంది
కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చి జీవితంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించేందుకు చక్కటి అవకాశాలపై అవగాహన కల్పించడం చాలా సంతోషంగా ఉంది. సాధారణంగా ఇంటర్ తర్వాత చదివే చదువులపైనే ధ్యాస ఉండేది. కానీ ఇప్పుడు జీవితంలో స్థిరపడాలంటే ఇలాంటి యూనివర్సిటీలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. – మహేశ్, విద్యార్థి