నైపుణ్యమే పెట్టుబడి అద్భుత ఆవిష్కరణలు
వర్సిటీలో నేర్చుకున్న పరిజ్ఞానంతో సమాజానికి ఉపయోగపడే పరిశోధనల వైపు దృష్టిసారించాలని జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ కట్టా నరసింహారెడ్డి అన్నారు. బుధవారం వర్సిటీ జేఎన్ ఆడిటోరియంలో టెక్నికల్ ఫెస్ట్ 2023 ప్రారంభోత్సవంలో వీసీ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ ఎం.మంజూర్ హుస్సేన్, ముఖ్య అతిథి వీసీ ఎల్.ఎస్.గణేశ్, కళాశాల ప్రిన్సిపాల్ జయలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ జి.వి.నర్సింహారెడ్డి పాల్గొన్నారు.
- జేఎన్టీయూహెచ్లో టెక్నికల్ ఫెస్ట్ ప్రారంభం
- విద్యార్థులు పరిశోధనల వైపు దృష్టిసారించాలి
- జేఎన్టీయూహెచ్ వీసీ కట్టా నరసింహారెడ్డి
- జేఎన్టీయూహెచ్లో ప్రారంభమైన రెండ్రోజుల టెక్నికల్ ఫెస్ట్
- ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు
కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 26 : వర్సిటీలో నేర్చుకున్న పరిజ్ఞానంతో సమాజానికి ఉపయోగపడే పరిశోధనల వైపు దృష్టిసారించాలని జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ కట్టా నరసింహారెడ్డి అన్నారు. బుధవారం వర్సిటీ జేఎన్ ఆడిటోరియంలో టెక్నికల్ ఫెస్ట్ 2023 ప్రారంభోత్సవంలో వీసీ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్ ఎం.మంజూర్ హుస్సేన్, ముఖ్య అతిథి వీసీ ఎల్.ఎస్.గణేశ్, కళాశాల ప్రిన్సిపాల్ జయలక్ష్మి, వైస్ ప్రిన్సిపాల్ జి.వి.నర్సింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెక్నాలజీ విద్యను అందించడంలో జేఎన్టీయూహెచ్కు ప్రత్యేక స్థానముందని.. ఈ వర్సిటీలో చదివిన విద్యార్థులు సమాజానికి ఉపయోగపడేలా పరిశోధనలు చేయాలన్నారు. నైపుణ్యాలు ఉంటే అన్ని ఇంజినీరింగ్ కోర్సుల విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. ఉద్యోగాలు పొందడమే కాదు.. ఉద్యోగాలు సృష్టిచేలా ఎదగాలన్నారు. యేడాది కాలంలో నేర్చుకున్న పరిజ్ఞానంతో ఆవిష్కరణలు చేపట్టాలని ఆ పరిజ్ఞానాన్ని తోటి విద్యార్థులకు అందించాలని సూచించారు. టెక్నికల్ ఫెస్ట్‌కు అన్ని రకాల సహాయ సహకారాలందిస్తానని తెలిపారు. వీసీ ఎల్.ఎస్.గణేశ్ మాట్లాడుతూ.. విద్యార్థులు సమయాన్ని వృథా చేయొద్దని గ్లోబల్ కాంపిటీషన్‌ను తట్టుకుని ఉన్నతంగా ఎదగాలంటే ప్రతిక్షణం సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దేశానికి యువశక్తి బలమని పేర్కొంటూ నేర్చుకున్న జ్ఞానంతో సమాజానికి సేవలందించేలా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ప్రతిభను ప్రదర్శించేందుకు టెక్‌ఫెస్ట్..

జేఎన్టీయూహెచ్ వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా ప్రతిఏటా నిర్వహిస్తున్న సాంకేతిక వేడుకలు (టెక్నికల్ ఫెస్ట్)ను ఆకట్టుకుంటున్నాయి. కళాశాలలో ఏడాదిపాటు.. పుస్తకాలతో కుస్తీపట్టి.. ప్రయోగశాలల్లో సాధించిన నైపుణ్యాలను, అంతర్గతంగా దాగిఉన్న ప్రతిభాపాటవాలను ప్రదర్శించేందుకు టెక్నికల్ ఫెస్ట్ చక్కటి వేదికగా మారుతున్నది. ఈ యేడాది టెక్‌ఫెస్ట్‌లో కళాశాలలోని ఇంజినీరింగ్ విభాగాలైన సివిల్ (స్తాపత్య), మెకానికల్ (కొనైజెన్స్ connaissanc), కంప్యూటర్ సైన్స్ (క్వెస్ట్), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ (ప్రజ్ఞ), మెటలార్జికల్ (ఆయాస్), కెమికల్ (జీనోస్), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ (స్ఫూర్తి), ఎంబీఏ (ఐదీప్) విద్యార్థులు భాగస్తులయ్యారు. విద్యార్థులే నాయకత్వ బాధ్యతలు తీసుకుని అధ్యాపకుల సలహాలతో సాంకేతిక ప్రదర్శనలు, పేపర్ ప్రెజెంటేషన్స్, క్విజ్, ఇతర ప్రతిభాపాటవాలను ప్రదర్శిస్తారు. కొత్తగా నేర్చుకున్న జ్ఞానాన్ని తోటి విద్యార్థులకు వివరిస్తారు. చివరగా ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు ఉత్సాహంగా వేడుకలో భాగస్తులవుతారు.
ఆకట్టుకున్న ప్రదర్శనలు..

జేఎన్టీయూహెచ్ వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో టెక్‌ఫెస్ట్‌లో విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. మొదటి రోజు సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ విద్యార్థులు వారికి సంబంధించిన అంశాలతో ప్రదర్శనలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో విద్యార్థులు క్విజ్ పోటీలను, పేపర్ ప్రజెంటేషన్ పోటీలను నిర్వహించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

