కొత్తగా రెక్కలొచ్చెనా.. సృజన.. ఆలోచన.. శాస్త్రీయత
జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన టెక్నికల్ ఫెస్ట్ సందడిగా సాగింది. రెండోరోజు విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలతో రూపొందించిన శాస్త్రీయ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాశాలలోని సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్
జేఎన్టీయూహెచ్ వార్షికోత్సవంలో ఆకట్టుకున్న విద్యార్థుల ప్రదర్శనలు
సృజనాత్మక ఆలోచనలతో విద్యార్థులు వహ్వా అనిపించారు. జేఎన్టీయూ రెండో రోజు టెక్నికల్ ఫెస్ట్‌లో భాగంగా ఆటలు, పాటలు, అదరగొట్టే నృత్యాలతో ఆకట్టుకున్నారు. సరికొత్త ఆవిష్కరణలు చేసి అబ్బురపర్చారు. సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. జేఎన్టీయూహెచ్తో పాటు 25 కళాశాలలకు చెందిన 3 వేల మంది విద్యార్థులు ఇందులో భాగస్వాములయ్యారు.
కేపీహెచ్‌బీ కాలనీ, ఏప్రిల్ 13: జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన టెక్నికల్ ఫెస్ట్ సందడిగా సాగింది. రెండోరోజు విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలతో రూపొందించిన శాస్త్రీయ ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. కళాశాలలోని సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెటలాజికల్, కెమికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎంబీఏ విద్యార్థులు సొంత ఆలోచనలతో రూపొందించిన ఆవిష్కరణలను ప్రదర్శించారు. నైపుణ్యం, సృజనాత్మక ఆలోచనలు పెంపొందించేలా పేపర్ ప్రజెంటేషన్, క్విజ్, టెక్నికల్ గేమ్‌లతో సందడిగా గడిపారు.

జేఎన్టీయూహెచ్తో పాటు మరో 25 కళాశాలల నుంచి 3వేల మంది విద్యార్థులు టెక్నికల్ ఫెస్ట్‌లో పాల్గొన్నారు. ఈ టెక్నికల్ ఫెస్ట్‌తో నైపుణ్యాల ప్రదర్శన, తోటి విద్యార్థుల నుంచి విభిన్నమైన ఆలోచనలను పంచుకోవడం, టీమ్‌గా పనిచేయడం వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం, సాంస్కృతిక కార్యక్రమాలతో అంతర్గత ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభించిందని విద్యార్థులు పేర్కొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా సాయంత్రం ఆటాపాటలతో వర్సిటీలో సందడి నెలకొంది.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

